రికార్డు సృష్టించిన‌ స్మృతి మంధాన

టీమిండియా స్టార్ మ‌హిళా క్రికెట‌ర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సృష్టించారు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా సెంచ‌రీ బాదిన భార‌త మహిళా క్రికెట‌ర్‌గా రికార్డుకెక్కారు. కేవ‌లం 70 బంతుల్లోనే ఆమె శ‌త‌కం సాధించారు. రాజ్‌కోట్ వేదిక‌గా ఐర్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో వ‌న్డేలో ఆమె ఈ ఘ‌న‌త సాధించారు. ఈ రికార్డు ఇంత‌కుముందు హ‌ర్మ‌న్ ప్రీత్ సింగ్ (87 బంతులు) పేరిట ఉండేది. కాగా, వ‌న్డేల్లో స్మృతికి ఇది ప‌దో సెంచ‌రీ కావ‌డం విశేషం.

సంబంధిత పోస్ట్