AP: తెలంగాణ కంటే ఏపీలోనే సంక్రాంతి పండుగను వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామంలో మాత్రం అసలు పండుగ వాతావరణమే కనిపించదు. దాదాపు 300 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తుంటారు. సంక్రాంతి పండుగ జరుపుకోకపోవడానికి పెద్ద కారణమే ఉంది. కొన్ని శతాబ్దాల క్రితం ఈ గ్రామ ప్రజలు సంక్రాంతికి సరుకులు కొనుగోలు చేయడానికి సంతకు వెళ్లి హఠాత్తుగా మృతి చెందారట. దాంతో అప్పటి నుంచి సంక్రాంతి పండుగ జరుపుకోరట.