వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే కూరగాయలను తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సోరకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. దీనిలో విటమిన్ సి, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇంకా కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉంటాయి. వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుంది. అదేవిధంగా టమాటలో ఉండే విటమిన్ సి వల్ల మన శరీరంలో తెల్లరక్త కణాల సంఖ్యను పెంచుతుందని సూచిస్తున్నారు.