మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సీతారామ్ తండాలో వరద బాధితులను బుధవారం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ కలిసి వారిని రానున్న వర్షాలు దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయంలో ఎవరు తండాలో ఉండొద్దన్నారు. వారికీ కావాల్సిన ఆహారం, నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే పోలీసులకు తెలియచేయాలనీ తండా వాసులకు సూచించారు.