ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులని అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 230 కిలోల గంజాయి, రెండు కార్లు, 6 సెల్ ఫోన్లు, 30 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మొత్తం గంజాయి విలువ దాదాపు 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.