AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో గడ్డం గ్యాంగ్ దోపిడీకి పాల్పడిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. "టిడ్కో ఇళ్ల ప్రారంభంలో నిమ్మకాయ నీళ్ల కోసమని చెప్పి రూ.28 లక్షలు దోచేశారు. టిడ్కో ఇళ్ల మంజూరుకు రూ.4 లక్షల మేర దండుకున్నారు. బిల్లుల కోసం గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేశారు. అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టారు." అని మంత్రి ధ్వజమెత్తారు.