AP: మాజీ ఎంపీ హర్ష కుమార్ బీజేపీ ఎంపీ పురంధేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ పోర్టులో దొరికిన 25వేల కేజీల డ్రగ్స్ గురించి ఎందుకు కూటమి ప్రభుత్వం నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఆ డ్రగ్స్ పురంధేశ్వరివి కాబట్టే కూటమి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టడం లేదని ఆయన మండిపడ్డారు. రూ. 50 వేల కోట్ల డ్రగ్స్‌ను పక్క దారి పట్టించేందుకు లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని కూటమి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందని ఆయన తెలిపారు.