ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో వంట గ్యాస్ సిలిండర్లు పేలదాంతో ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమై ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. రావుల చెరువు సమీపంలో ఉన్న భవనంలో ప్రమాదవశాత్తు రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఇల్లు కుప్పకూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరకుని క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.