అరటి ఆకులు చాలా పెద్దవిగా ఉండడం వలన ఆకుల కింద పండే అరటి పండ్లకు సూర్యరశ్మి అందదు, అందుకే అవి సూర్యుని వైపుకు తిరిగి పెరుగుతాయంట. ఎందుకంటే ఏ పండ్లైనా చెట్టుకి కాసిన తరువాత వాటికీ జియోట్రోపిజం అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో అవి భూమి గురుత్వాకర్షణ శక్తికి ఆకర్షించబడతాయి. కానీ అరటి పండ్ల విషయంలో ఇలా జరగదు. అవి సూర్యుడు ఎటువైపు పడుతుంటే అటు వైపుకు తిరిగి పెరుగుతుంటాయి. దీన్ని నెగటివ్ జియోట్రాఫిజమ్ అంటారు. దీని వలన అరటి పండ్లు వంకరగా ఉంటాయి.