ఏపీలోని ఏలూరు ఆటో నగర్‌లో ఓ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దొంగతనం చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని ఇంజిన్ బెల్ట్‌తో విచక్షణా రహితంగా చితక బాదారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. కాగా, వ్యక్తిని కొడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.