కాకినాడ జిల్లా రామచంద్రపురంలో పది అడుగుల భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. స్థానిక ఏటిగట్టు వద్ద మొక్కలకు రక్షణగా వేసిన వలలో చిక్కుకుంది. దీంతో కొండచిలువను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. స్థానిక యువకులు భయంతో ఆ కొండచిలువపై దాడికి దిగారు. అంతా కలిసి కర్రలతో కొట్టి చంపారు. ఏలూరు కాల్వకు వరద నీరు భారీగా చేరడంతో కొండచిలువలు వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.