ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌లో UN డిస్‌ఎంగేజ్‌మెంట్ అబ్జార్వర్ ఫోర్స్‌లో సేవలందిస్తున్న భారత సైనికుడు సురేశ్ గాయపడ్డారు. ఓ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయం కావడంతో సురేశ్‌ను అక్కడి భారత ఉన్నతాధికారులు టెల్‌అవీవ్ నుంచి సైనిక విమానంలో స్వదేశానికి తరలించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.