భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడేళ్ల తర్వాత ఓ టెస్ట్ మ్యాచ్‌కు కాన్పూర్ ఆతిథ్యమివ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియా క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన.. చివరిదైన రెండో టెస్ట్‌లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.