ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. మంగళవారం రాత్రి 10 గంటలకు బ్యారేజీ నుంచి 70 గేట్ల ద్వారా 6.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. 500 క్యూసెక్కుల నీటిని కాలువలకు మళ్లించారు. వరద ఉధృతి గంట గంటకూ తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి.