వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు ఓ మహిళ షాకిచ్చింది. విజయవాడలోని సింగ్‌నగర్ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిన్న జగన్ పర్యటించారు. ఈ క్రమంలో ఓ మహిళను ‘ఏమ్మా.. మీకు ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు అందుతున్నాయా’ అని అడిగారు. దానికి ఆమె ‘ప్రతి ఇంటి ముందు పీకల్లోతు నీళ్లున్నాయి. వాళ్లయినా ప్రతి ఇంటికి ఎలా వస్తారు?’ అని సమాధానమిచ్చింది. ఆ సమాధానానికి జగన్ షాకయ్యారు.