గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, అతని భార్యకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. గాంధీ నగర్ ప్రాంతంలో గురువారం వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. సురేంద్ర అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై గ్యాస్ సిలిండర్‌తో ఇంటికి తిరిగి వస్తున్నాడు. అతని ఇంటి ముందు బైక్ నుంచి సిలిండర్‌ను దించే ప్రయత్నంలో అది పేలిపోయి ఈ ప్రమాదం జరిగింది.