ఏపీలో భారీ వర్షాలతో పలు జిల్లాలు నీట మునిగాయి. అయితే ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. కోనసీమ జిల్లాలోని కె.గంగవరం మం. కోటిపల్లి వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సుభాష్ పర్యటించారు. కుమ్మరివారి సావరం దగ్గర బలహీనంగా ఉన్న ఏటుగట్టును పరిశీలించారు. వరదల కారణంగా ప్రభుత్వపరంగా అందిస్తున్న సాయంపై ఆరా తీశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు.