భారత్ స్వదేశీయంగా తయారు చేసిన అధునాతన యుద్ధ నౌకలు అయిన ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేశారు. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకల సేవలను ప్రారంభించారు. ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్ జలాంతర్గామిని ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో డెవలప్మెంట్ చేశారు. ఈ యుద్ధనౌకల ప్రవేశంతో భారత నేవీ బలం మరింగ పెరగనుంది.