అలర్ట్.. మరో రెండు రోజులు వానలు

76చూసినవారు
అలర్ట్.. మరో రెండు రోజులు వానలు
ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. దాదాపు రెండు వారాల నుంచి రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పాడే అవకాశాలున్నట్లు తెలిపింది. దీంతో రెండు రోజులు ఏలూరు, అల్లూరి, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్