పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు వేగంగా విస్తరిస్తోండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టులు, దేశ సరిహద్దుల వద్ద అలర్ట్ ప్రకటించింది. విదేశాల నుంచి వచ్చే వారిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారెంటైన్ చేయాలని పేర్కొంది. ఈమేరకు ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రితో పాటు సఫ్దర్ జంగ్, లేడీ హార్దింగ్ ఆస్పత్రులలో మంకీపాక్స్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.