అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యసాధనకు అనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్‌కు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. ట్రాన్స్ జెండర్లకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.