జమ్మూకశ్మీర్‌లో మంగళవారం భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే స్వల్ప స్థాయిలో రెండుసార్లు భూమి కంపించింది. పూంచ్ ప్రాంతంలో ఉదయం 6:45 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 4.9 తీవ్రతతో భూకంపం సంభవించగా, ఆ తర్వాత 7 నిమిషాలకే(6:52 గంటలకు) 4.8 తీవ్రతతో మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.