AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న కర్నూలులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తుని, నంద్యాల, కావలి, కర్నూలు తదితర ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ, రేపు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచించింది.