తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో ఆగస్టు 29 నాటికి అల్పపీడనం ఏర్పాడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆగస్టు 31 వరకు ఏపీలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. శుక్రవారం కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.