ఆ అధికారులు అందర్నీ బదిలీ చేయాలి: ఏపీ సీఎస్

59చూసినవారు
ఆ అధికారులు అందర్నీ బదిలీ చేయాలి: ఏపీ సీఎస్
ఏపీలో త్వరలో సాధారణ ఎన్నికలు ఉన్నందున పోలింగ్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని ఈనెల 25వ తేదీలోగా బదిలీ చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, బదిలీలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్