AP: మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆళ్ల నాని టీడీపీలో చేరిక వాయిదా పడింది. టీడీపీలో చేరేందుకు ముహూర్తం బాగా లేకపోవడంతో చేరికను ఆయన వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా టీడీపీ సభ్యత్వం ఆళ్ల నాని తీసుకున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.