చెత్త సమస్యకు చైనా టెక్నాలజీతో చెక్: మంత్రి నారాయణ

84చూసినవారు
చెత్త సమస్యకు చైనా టెక్నాలజీతో చెక్: మంత్రి నారాయణ
రాష్ట్రంలో చెత్త సమస్యకు చైనా టెక్నాలజీతో చెక్ పెడతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని, తాము చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం చేపడతామన్నారు. రాజధాని అమరావతిలో పనులను మూడేళ్లలో పూర్తి చేసి అభివృద్ధికి బాటలు వేస్తామని మంత్రి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్