శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అద్భుత గెలుపు అందించిన కార్యకర్తలకు న్యాయం చేస్తానని సీఎం తెలిపారు. పార్టీ జెండా మోసిన వారికి ఎప్పుడూ అన్యాయం జరగదని, కూటమి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీతో కలిసి పనిచేయాలన్నారు.