అనకాపల్లి: జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇచ్చి కుప్పకూలిన బాధితుడు

79చూసినవారు
అనకాపల్లి: జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇచ్చి కుప్పకూలిన బాధితుడు
మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామానికి చెందిన అనిమిరెడ్డి రమణకు సంబంధించిన ఇల్లు మూడేళ్ళ క్రితం కాలిపోగా ప్రభుత్వం తరపున 3 లక్షల నష్ట పరిహారం వస్తుందని చెప్పారు. అధికారులు చుట్టూ తిరుగుతున్నా నష్ట పరిహారం అందకపోవడంతో సోమవారం జిల్లా కలెక్టర్కు అర్జీ ఇచ్చిన వెంటనే కలెక్టర్ ముందే రమణ కుప్పకూలి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న రమణను సిబ్బంది హుటాహుటినా స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్