అనంతగిరి: గిరిజనులను తప్పని డోలీమోత కష్టాలు

54చూసినవారు
అల్లూరి జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు నేటికీ డోలిమోత కష్టాలు తప్పడం లేదు. అనంతగిరి మండలంలోని వాలసి పంచాయతీ పరిధి బిచోల్ రంగనికి చెందిన పాంగి. రామరావు కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో గ్రామానికి రహదారి సౌకర్యం లేక వాహనాలు రాక కుటుంబీకులు డోలికట్టి సోమవారం రామరావుని 3 కిలోమీటర్లు వాలసి వరకు మోసుకొచ్చారు. అక్కడి నుంచి ఆటోలో లుంగాపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్