అనంతగిరి మండలంలోని గుమ్మ జంక్షన్ నుంచి గుమ్మ వరకు తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం గుమ్మ జంక్షన్ నుంచి గుమ్మ వరకు తారురోడ్డు నిర్మాణం కొరకు మట్టిరోడ్డుపై కంకరరాళ్లు పోసి విడిచిపెట్టేయడంతో రహదారిపై రాళ్ళు తేలిపోయి ఉండడంతో రాకపోకల సమయంలో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నామని సోమవారం తెలిపారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని గిరిజనులు కోరుతున్నారు.