అరకులోయ మండలంలోని మాదల పంచాయతీలోని దుమ్మగూడ్రి పరిసర గ్రామాల్లో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకురావాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. టవర్ నిర్మాణం చేపట్టి సంవత్సరం అవుతున్న సిగ్నల్స్ లేక అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు అంబులెన్స్ కు ఫోన్ చేయాలన్న అలాగే అంగన్వాడి సిబ్బంది పిల్లల హాజరు నమోదుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఫోన్ సిగ్నల్స్ సమస్యపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.