మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షానికి పెదబయలు మండలంలోని గిన్నెలకోట పంచాయతీలోని లండూలు వంతెనపై వాగు పొంగి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో జి. మాడుగులకి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం మెట్టగూడలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి బైక్పై వంతెన దాటుతుండగా వరద ఉధృతికి వాగులో ఇరుక్కున్నారు. దీనితో స్థానికులు హుటాహుటిన వెళ్లి ఇద్దరిని కాపాడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.