ఉత్తమ డాక్టర్ గా ప్రశంసా పత్రం అందుకున్న మంజు భార్గవి

62చూసినవారు
ఉత్తమ డాక్టర్ గా ప్రశంసా పత్రం అందుకున్న మంజు భార్గవి
78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనంతగిరి మండలంలోని లుంగాపర్తి వైద్యురాలు మంజుభార్గవి ఉత్తమ డాక్టర్ ప్రశంసా పత్రం పొందారు. ఈ సందర్భంగా గురువారం అల్లూరి జిల్లా పాడేరులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కార్యక్రమంలో అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతులు మీదుగా ఉత్తమ డాక్టర్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. వైద్యురాలు మంజుభార్గవికి పాడేరు ఐటిడిపిఓ అభిషేక్ పలువురు అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్