పెదబయలు: ఈ నెల 28వ తేదీన బహిరంగ విచారణ సమావేశం

79చూసినవారు
పెదబయలు: ఈ నెల 28వ తేదీన బహిరంగ విచారణ సమావేశం
పెదబయలు మండలంలోని 28వ తేదీన ఉపాధి హామీ పథకం ద్వారా బహిరంగ విచారణ సమావేశం ఉంటుందని వైసీపీ మండల అధ్యక్షుడు పద్మారావు బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 2024లో మండలంలోని 16 సచివాలయాల పరిధి గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై బహిరంగ విచారణ సమావేశం ఉంటుందన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే సమావేశానికి అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం రానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్