ఒక ముఖ్యమంత్రి విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడారు. మరో సారి జగన్‌లాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే విశాఖతో పాటు సముద్రమూ మిగలదని అన్నారు. ఈ భవనాలను దేనికి వాడుకోవాలో అర్ధం కావట్లేనదని చెప్పుకొచ్చారు. రుషికొండను టచ్ చేసే ధైర్యం మామూలు వ్యక్తులకు ఉండదని ఎద్దేవా చేశారు.