పర్యాటకశాఖ భూములు పరిశీలన

71చూసినవారు
పర్యాటకశాఖ భూములు పరిశీలన
భీమిలి మండలం చేపలుప్పాడ, కాపులుప్పాడ గ్రామాల్లో పర్యాటక శాఖకు చెందిన భూములను ఆ శాఖ అధికారిణి జ్ఞానవేణి గురువారం మండల సర్వేయర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆక్రమణలను తొలగించేందుకు ఈ తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఋషికొండ ప్రాంతంలో బ్లూ ఫ్లాగ్ నిబంధనలకు అనుగుణంగా పునర్నిర్మాణ చర్యలు చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్