అనకాపల్లి జిల్లా రావికమతంలో దాచేపల్లి రామారావు హార్డ్‌వేర్ షాపులో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో షార్ట్ సర్క్యూట్ మూలంగా ఈ ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. మొత్తం మూడు ఫ్లోర్లులో గల పెయింటింగ్, ఐరెన్, ఎలట్రికల్ సమగ్రి ని మంటలు చుట్టుముట్టాయి. 20 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటదని అంచనా వేస్తున్నారు.