చోడవరంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

3289చూసినవారు
కొద్ది రోజుల్లో ఓట్లు లెక్కింపు జరగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నారు. ఆదివారం ఉదయం చోడవరం లక్ష్మీపురం రోడ్డులో ద్వారకానగర్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీఐ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల రికార్డులను చెక్ చేసి సరైన రికార్డ్స్ లేని వాహనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాహన చోదకులు వాహనాలకు సంబంధించిన సరైన రికార్డులను తమతో ఉంచుకోవాలని హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి సురక్షా పరికరాలు ధరించడం వంటి ప్రాధమిక నిబంధనలు పాటించాలని అనుమతి లేని సరుకులు రవాణా చెయ్యరాదని, వాహనాల దొంగతనం నేరమని, అలాంటి వాహనాలను కొన్నా, అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్డెన్ సెర్చ్ లో భారీ సంఖ్యలో వాహనాలు పట్టుబడటం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్