విశాఖలో వైద్యులు ఆందోళన

56చూసినవారు
విశాఖలో వైద్యులు ఆందోళన
కలకత్తాలో జూనియర్ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ను ఐద్వా విశాఖ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ నుండి పార్క్ హోటల్ వరకు జరిగిన డాక్టర్స్ ర్యాలీలో పాల్గొని ఐద్వా మద్దతు తెలియజేసింది. ఈ ఘటన మరో నిర్భయగా పేర్కొంటూ నిర్భయ ఘటన తరువాత వర్మ కమిషన్ సిఫార్సులు ప్రక్కకు నెట్టి వేయపడ్డాయన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్