విశాఖ రుషికొండ బీచ్ లో స్పీడ్ బోటు ను పునరుద్ధరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వరుసగా వర్షాలు పడుతుండడంతో స్పీడ్ బోర్డ్ సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం నుంచి స్పీడ్ బోట్ ను పునరుద్ధరించినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో పర్యాటకుల సందడి మళ్లీ జోష్ అందుకుంది.