దీపావళి పండుగను పర్యావరణ హితంగా నిర్వహించుకుందామని విశాఖలోని ఎఎస్ రాజా వుమెన్స్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం కాసు కోరారు. గురువారం సాయంత్రం కళాశాలలో విద్యార్ధులతో గ్రీన్ క్లైమేట్ టీం, సిఫా సంస్థలు పర్యావరణ హిత దీపావళి పై అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దీపాల పండుగను పర్యావరణ హితంగా సాంప్రదాయ బద్దంగా జరుపుకుందామన్నారు.