ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ కాదు గ్లోబల్ స్టార్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. బుధవారం జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగంలో మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోడీ అన్నారు. బిజెపి, టిడిపి, జనసేన కాంబినేషన్ అదిరిపోయిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ కాంబినేషన్ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.