Mar 09, 2025, 17:03 IST/
భారత్ జట్టుకు అభినందనలు: సీఎం చంద్రబాబు
Mar 09, 2025, 17:03 IST
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయం సాధించడంపై ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 'నేను సైతం మన దేశంతో కలిసి మన బ్లూ జెర్సీ వీరుల గొప్ప విజయాన్ని జరుపుకుంటున్నాను. న్యూజిలాండ్‌ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమ్ ఇండియా తమ అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి మనల్ని గర్వపడేలా చేసింది. వారి కృషికి, అంకితభావానికి, అసాధారణ విజయానికి హృదయపూర్వక అభినందనలు, అని సీఎం CBN ట్వీట్ చేశారు.