ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ గెలవడం చాలా ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అద్భుత ఆట తీరుతో భారత్ జట్టు మరోసారి సత్తా చాటిందని ఆయన అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రేవంత్‌రెడ్డి పోస్ట్ చేశారు.