గాజువాకలో కొనసాగుతున్న వైద్య శిబిరం

85చూసినవారు
గాజువాకలో కొనసాగుతున్న వైద్య శిబిరం
గాజువాక పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలోని సాయిరాం నగర్‌లో అతిసార వ్యాధి ప్రబలి 13 కేసులు నమోదయ్యాయి. డి ఏం హెచ్ వో జగదీశ్వరరావు తక్షణమే స్పందించి ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తగిన చికిత్స అందించాలని సూచించారు. ఈ వ్యాధి తాగునీటి పైపులు - డ్రైనేజ్ నీటితో కలవడం వలన వస్తోందన్నారు. జోనల్ కమిషనర్‌తో సంప్రదించి వాటర్ పైపులు, శానిటేషన్ గురించి మాట్లాడతానన్నారు. శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్