విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశానికి అన్ని సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యారామ్ మాట్లాడుతూ ఈ నెలాఖరున అచ్యుతాపురం వస్తున్న ప్రధాని మోదీ, అనంతరం నిర్వహించే సభలో విశాఖ ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.