రానున్న సంవత్సరంలో గ్రామాల్లో చేపట్టబోయే గ్రామాభివృద్ధికి చేపట్టవలసిన పనులపై బుధవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎండిఓ అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు అధికారులకి చేపట్టవలసిన పనులను నిర్దేశిస్తూ తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా సిసి రోడ్ నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని సూచించారు.