భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గ్రామ, గ్రామాన మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు. మొదటగా రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదించిన సందర్భమును స్మరించుకుంటూ మాడుగుల మండల ప్రజా పరిషత్ కార్యాలయములో జరిగిన కార్యక్రమంలో ఎంపిపిటి వి.రాజారాం, ఎండిఓ కే అప్పారావు తదితరులు పాల్గొని గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించి, రాజ్యాంగాన్ని కాపాడతానని ప్రతిజ్ఞ చేయించారు.