గంగాదేవిపేటలో వీధిదీపాలు ఏర్పాటు

74చూసినవారు
గంగాదేవిపేటలో వీధిదీపాలు ఏర్పాటు
మునగపాక మండలంలో గంగాదేవిపేట గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడక్కడ పాడైపోయిన వీధి దీపాల స్థానంలో సోమవారం కొత్త లైట్లు వేయించడం జరిగిందని మూలపేట సర్పంచ్ భీశెట్టి గంగఅప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు గంగాదేవిపేట గ్రామంలో దగ్గరుండి వీధి దీపాలను ఏర్పాటు చేసి కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగుకు, త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా పంచాయతీ పాలకవర్గం ఎప్పడికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్